యాదమరి, మన ధ్యాస డిసెంబరు-28 యాదమరి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఒ)గా సమర్థవంతంగా సేవలందించిన రుక్మిణమ్మ నేడు పదవీవిరమణ చేయగా, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఈ.ఒ–2 ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పూర్వ డి.ఇ.ఒ, ప్రస్తుత డైట్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి, డి.వై.ఇ.ఒ ఇందిరతో పాటు ప్రజాప్రతినిధులు హాజరై, రుక్మిణమ్మ సేవలను ప్రశంసించారు. విద్యాశాఖ అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆమె చేసిన కృషి ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పి.ఆర్.టి.యు రాష్ట్ర నాయకులు ఏ.యం.గిరిప్రసాద్, కనకాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.విజయ భాస్కర్ రెడ్డి, ఎస్.టి.యు జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, యు.టి.ఏఫ్ రెడ్డప్ప నాయుడు, ఎ.పి.టి.ఏఫ్ జె. అమరనాధ నాయుడు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు ఎం.ఈ.ఒ మోహన్, బంగారుపాళ్యం ఎం.ఈ.ఒ రమేష్ బాబు, గుడిపాల ఎం.ఈ.ఒ గణపతి కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళా నాయకులు హిమబిందు, లత, విజయలక్ష్మి, నిరజ, ఆఖిలేండేశ్వర, రెహన, రేఖా, లక్ష్మీ దేవి, జయశ్రీ, రాధిక, రెడ్డిమ్మ తదితరులు పాల్గొని రుక్మిణమ్మకి శుభాకాంక్షలు తెలిపారు. పదవీవిరమణ అనంతరం మాట్లాడిన రుక్మిణమ్మ, తన సేవా కాలంలో సహకరించిన ఉపాధ్యాయులు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యా రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *