మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో అధునాతన సౌకర్యాలతో ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చింది.ఆదివారం ప్రత్తిపాడు నియోజవర్గం వరుపుల సత్యప్రభ ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ క్రీడలు వల్లన మానసి కోల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతం లో షటిల్,బ్యాట్మెంటన్ ఆడేందుకు ఇండోర్ స్టేడియంను
నిర్మించడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు,ఎంపిపి గొల్లపల్లి బుజ్జి,బి.గోపాలకృష్ణ,ఎం. నారాయణస్వామి,పి.శ్రీను పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *