యాదమరి, మన ధ్యాస డిసెంబరు-14 విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్‌లో యాదమరి మండల జట్టు ఘన విజయం సాధించింది. పూతలపట్టు టీంపై 67 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు అడుగుపెట్టిందని జట్టు కెప్టెన్ సిరాజ్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో కె.గొల్లపల్లె ఉపాధ్యాయుడు నాగభూషణం 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అలాగే అయూబ్ 26 పరుగులు చేసి జట్టు స్కోరుకు విలువైన తోడ్పాటు అందించారు. జె.భాస్కర్ రెడ్డి, మహేష్, విశ్వనాథ్, సురేష్, సబీర్, సుధాకర్ రెడ్డి తదితరులు కూడా మ్యాచ్‌లో గొప్ప ప్రతిభ కనబరిచి జట్టు విజయానికి బలమైన అండగా నిలిచారు. రేపు జరగనున్న సెమీ ఫైనల్‌లో కూడా ఇదే ఉత్సాహంతో, మెరుగైన నైపుణ్యంతో ఆడి యాదమరి మండలానికి కప్‌ను తేవాలనే ఆశాభావాన్ని మండల విద్యాశాఖాధికారులు రుక్మిణీమ్మ, హెచ్‌.ఎల్‌.ఎన్‌. ప్రసాద్, హెచ్‌.ఎం. లలిత, హేమలత, రమాబాయి, చంద్రశేఖర్, సంఘ నాయకులు కనకాచారి, మదన్ మోహన్, హిమబిందు రెడ్డి, శివప్రసాద్ మరియు ఉపాధ్యాయులు వ్యక్తం చేశారు. యాదమరి టీం ఈ విజయంతో మండలంలో ఆనందం నెలకొంది. సెమీ ఫైనల్‌లో జట్టు మరింత గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *