.మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 14 : నెల్లూరు నగరంలో మాగుంట లే అవుట్‌లో ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన ప్రశాంత్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ సెంటర్ ఆదివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజితరెడ్డి. మాజీ మేయర్ నంది మండలం భాను శ్రీ ప్రారంభించినారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత రెడ్డి మాట్లాడుతూ…… ప్రపంచస్థాయి ఐవీఎస్ చికిత్స కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసినందుకు ఆసుపత్రి చైర్పర్సన్ డాక్టర్ గీత హరిప్రియ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఆస్పత్రిని నెల్లూరు జిల్లా ప్రజలు పిల్లల కలగని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల ఆరోగ్య పరిరక్షణతో పాటు సంతానలేమి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందించడం ద్వారా మహిళలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుందని తెలిపారు.డాక్టర్ గీతా హరిప్రియ మాట్లాడుతూ…….. 1996 నుంచి నెల్లూరు జిల్లా ప్రజలతో అనుబంధం ఉందని తెలిపారు సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంహిత మోటూరి మాట్లాడుతూ…….. ఐవీఎస్ సాంకేతికత ఆధునిక లాబరేటరీ సదుపాయాలు సమగ్ర మహిళ ఆరోగ్య సేవలను అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు.సెంటర్ డైరెక్టర్ మాట్లాడుతూ.. 1996 నుంచి నెల్లూరు జిల్లాలో ప్రసూతి, గైనకాలజీ రంగాల్లో విశేష అనుభవంతో సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ IVF, సంతాన సాంకేతిక చికిత్స మహిళలు ఎదుర్కొనే హార్మోనల్ సమస్యలు, గర్భధారణలో ఏర్పడే సమస్యలు, మాతృశిశు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల సేవలు ఒకే చోట లభించే విధంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, మహిళా వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొని కేంద్ర నిర్వాహకులను అభినందించారు. మహిళల ఆరోగ్యానికి భరోసానిచ్చే విధంగా ఈ కేంద్రం నెల్లూరు జిల్లాలో విశేష సేవలు అందిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మస్తాన్ భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *