మన ధ్యాస నారాయణ పేట జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని పరేవుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి వాకిటి శ్రీహరీ గారి ఆధ్వర్యంలో బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి. కటికె అంజమ్మ, గారి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఇంటింట ప్రచారం ముమ్మరంగా నిర్వచించారు. ఈ సందర్భంగా కటికె అంజమ్మ మాట్లాడుతూ, మన సీఎం రేవంత్ రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ముందుకు రావడం జరుగుతుందని తెలిపారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.