

- – సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి…
- శంఖవరం కేజీబీవీ లో ఆకస్మిక తనిఖీ..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి) లో సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి. దేవానందరెడ్డి బుధవారం అకస్మక తనికీలు చేసారు. స్థానిక కెజిబివిలో ప్రతీ తరగతిలోనూ విధ్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలను బోధించి, వారి నైపుణ్యాలను పరిశీలించి, విశ్లేషించారు. విద్యార్థుల విద్య, ప్రమాణాలను అంచనా వేసి, విధ్యార్థుల సామార్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులను ఆదేశించి, వలు సూచనలు చేసారు. అనంతరం ఏడవ తరగతి విద్యార్థినిలకు రాసే సామర్థ్యం పై స్వయంగా పరిశీలించారు. 9వ తరగతి విద్యార్థులకు సామాజిక శాస్త్రం నుండి “దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష వ్యతిరేకంగా పోరాటం” అనే పాఠ్యాంశం పై అర్ధగంట చదవడానికి సమయం ఇచ్చి అనంతరం విద్యార్థులచే వారు అర్థం చేసుకున్న విషయాలను వివరించమన్నారు. విద్యార్థులచే ప్రశ్నలు రూపొందింపజేసి, పీర్ క్వశ్చనింగ్ ద్వారా తరగతి మొత్తాన్ని చురుకుగా పాల్గొనేటట్లు ప్రోత్సహించారు.10, 11, 12వ తరగతి విద్యార్థులకు స్లిప్ టెస్ట్ నిర్వహించారు, ఆయనే స్వయంగా జవాబు పత్రాలను మూల్యాంకన చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను అంచనా వేశారు. అనంతరం కెజిబివి ఆవరణ, వసతి గృహం, వంటశాల, ప్రయోగశాలలను తనికీ చేసి, ప్రతీ ఒక్కరు పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన కార్యదర్శి దేవానందరెడ్డి కెజిబివి మెరుగైన నిర్వహణకు సరైన కార్యాచరణ రూపొందించుకుని, వాటిని ఆచరించాలని, విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పలు అంశాలపై సూచనలు చేసారు. కార్యక్రమంలో కెజిబివి ప్రత్యేక అధికారి బాలాకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.