

- వ్యవసాయ అధికారి పి గాంధీ
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.మండపం, గైరంపేట గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా రైతులకు సమగ్ర ఎరువుల వాడకం గూర్చి అవగాహన కల్పించారు.వరి పంటకు హెక్టారుకు 250కిలోల యూరియాను మూడు భాగాలుగా చేసి మూడు దఫాలుగా అనగా నాటుటకు ముందు దమ్ములో, దుబ్బు చేసే దశలో మరియు అంకురదశలో బురద పదునులో మాత్రమే వేయడం ద్వారా వేసిన ఎరువు వృధాకాకుండా చూడొచ్చని వివరించారు.ప్రత్తిపoటలో హెక్టారుకు యూరియా 175కిలోలు మూడు భాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ల వద్ద పాదులు తీసి వేసుకోవాలని తెలిపారు.యూరియా అందుబాటులో లేనియెడల నానో యూరియా అరలీటరు ఎకరాకు పిచికారీ చేయాలి అని , దీని తర్వాత మరలా సాంప్రదాయ యూరియా వేయనవసరం లేదని వివరించారు.అనంతరం రైతులతో వరి,ప్రత్తి పంటలను పరిశీలించి పంట నమోదు అవశ్యకతను,చీడపీడల నివారణా చర్యలను వివరించారు.ప్రతీ రైతు సేవా కేంద్ర పరిధిలో సిబ్బంది వివిధ పంటల్లో సిఫార్సు మోతాదు యూరియా గూర్చి,నానో యూరియా , నానో డి ఏ పి గూర్చి రైతులకు అవగాహన కల్పించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు సురేష్,రైతులు, మహిళలు పాల్గొన్నారు.