

యాదమరి, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):
మండల కేంద్రంలో పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి, చిత్తూరు అర్భన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు. గిరిరాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పి.ఆర్.టి.యు ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. మండల శాఖ మంచి సేవలతో రాష్ట్ర కార్యవర్గంలో ప్రాధాన్యం సంపాదించిందని వేణుగోపాల్ అభినందించారు. ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ మంచి కార్యక్రమాలకు ముందుండాలని కనకాచారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పదిమంది సీనియర్ టీచర్లు, రిటైర్డ్ ఉపాధ్యాయులు భాస్కరరావు, త్రివేణి, వెంకటేశ్ తదితరులను సన్మానించి గౌరవించారు. ఈ వేడుకలో శివప్రసాద్, సురేష్ రెడ్డి, ఆనంద పిళ్లై, షహనాజ్, ఆఖిలభాను, రమేష్, విశ్వనాథ్, హరికృష్ణ, తులసి ప్రసాద్, హేమకుమార్, హరి తదితరులు పాల్గొన్నారు.