మన ధ్యాస, నారయణ పేట జిల్లా : వినాయక చవితి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది లడ్డు వేలం, అలాంటి లడ్డు వేలం 95 వేలు పలకడంతో శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాధుడి యొక్క లడ్డూను, వేలం పాటలో కొనపొల అశోక్ 95 వేల రూపాయలకు వేలం పడి లడ్డూను దక్కించుకొని విఘ్నేశ్వరుని యొక్క భక్తిని చాటుకున్నాడు.అనంతరం టెంకాయ కలశం తిపనోళ్ళ తిమ్మప్ప 50వేలు, పండ్లు శాలువా 11 వేల రూపాయలకు వేలం పడి దక్కించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటి సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.







