

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల తో పాటు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి లు కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వమని ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లు బిక్షపతి,సవైయి సింగ్, ఎంపీడీవో అనిత,నాయకులు లోక్య నాయక్,నాగభూషణం గౌడ్, ఆకాష్,అనిస్,ఖాళీక్,ప్రజా పండరీ,రఫీ,తదితరులు ఉన్నారు.
