

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించాలి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజలను గూడ్స్ వాహనాల్లో తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బుధవారం ఉదయం మద్దూరు టౌన్ లో కూలీలను తరలిస్తున్న మూడు గూడ్స్ వాహనాలను పట్టుకుని జరిమానా విధించి వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.రవాణా చట్ట ప్రకారం గూడ్స్ వాహనాలు కేవలం సరుకుల రవాణా కోసమే ఉపయోగించాలి వాటిలో వ్యక్తులను, కూలీలను, చిన్నపిల్లలను రవాణా చేయడం నేరమని తెలిపారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం వల్ల తీవ్ర ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ ఉంటాయని తెలిపారు. వాహనదారులు, డ్రైవర్లు గూడ్స్ వాహనాల్లో వ్యక్తులను తీసుకెళ్లినట్లు గుర్తించిన పక్షంలో సంబంధిత వాహనం పై చర్యలు తీసుకొని వానాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ ప్రాణాలను ముప్పుగా మారే ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుసరించరాదని కోరారు. ప్రతి ఒక్కరు రవాణా నియమాలు గౌరవించి సురక్షిత రవాణా కోసం బస్సులు, ఆటోలు, టాక్సీల వంటివి వాడాలి అని మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి అని గుర్తుంచుకొని ప్రయాణం చేయాలని ఎస్ఐ తెలిపారు.