సంస్కార కేంద్రాలుగా బాల వికాస్ కేంద్రాలు.బాల్యం నుండి క్రమ శిక్షణ దేశ భక్తి అలవరుచుకోవాలిసామరసత సేవా ఫౌండేషన్ జిల్లా సంయోజక్ అర్రిబోయిన పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:-

చిన్న నాటి నుండే చిన్నారుల్లో క్రమశిక్షణ దేశభక్తి,విద్యాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి తో తీర్చిదిద్దడమే బాల వికాస్ కేంద్రాలు అని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస్ కేంద్రాల జిల్లా సంయోజక్ అర్రిబోయిన రాంబాబు పిలుపు ఇచ్చారు. గురువారం గురు పూర్ణిమ సందర్భంగా సింగరాయకొండ మండలంలో దేవాలయాల కేంద్రంగా నిర్వహించనున్న బాల వికాస్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సరసత కార్యకర్త శ్రీరామ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ దేవాలయాల కేంద్రంగా నివాస ప్రాంతాల్లో ఉండే దేవాలయాల కేంద్రంగా బాల బాలికల లో దేశభక్తి, దైవ భక్తి సంస్కారాలు ప్రధానంగా బాల వికాస్ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. సంస్కారం తో పాటు చదువు, కలలు, ఆటలు, పెద్దల పట్ల గౌరవ భావం పెంపొందించడం ప్రధానంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా లో 27 కి పైగా బాల వికాస్ కేంద్రాలను వివిధ మండలాల లో ఆయా ప్రాంతాల సంయోజకులు బాల వికాస్ కేంద్రాలను ప్రారంభించారని రాంబాబు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో అర్చకులు, మాతాజీ లు, తల్లి దండ్రులు, బాల బాలికలు, ఆలయ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో సాయినాధుని ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతుపాలెం గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ సిబిఎన్ కోఆర్డినేటర్ యాళ్ళ జగదీశ్…

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి నియోజకవర్గంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయాలు భక్తులతో కిక్కిరి సాయి. సాయినాధుని పర్వదినం గురువారం కావడంతో భక్తులు ఉదయం నుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలతో సాయినాధునికి పూజలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు