

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, వట్టం రవి కన్వెన్షన్ హల్ అధినేత వట్టం రతన్ కుమార్ గుప్తా తన 46వ జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. తొలుత వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని, ఆ తర్వాత తాను చదువుకున్న శిశు మందిర్ విద్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శిశుమందిర్ సిబ్బంది, వాసవీ, వనితా క్లబ్ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో వట్టం పుష్పవతి, వట్టం అనూష, వట్టం నిక్షయ, అంజయ్య ఆచారి, వెంకటేష్ ఆచారి, ప్రతాప్ రెడ్డి, బి.రవీందర్, మనసాని నాగరాజ్, వనితా క్లబ్ అధ్యక్షురాలు మనసాని సరళ, సెక్రటరీ లంకాల సుజాత, ప్రసన్న, శిశుమందిర్ ప్రధానోపాధ్యాయులు కుర్మయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది శ్రీనాథ్, శివన్న, సత్యం, పండు, రఘు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.