

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 05 :- జోగులాంబగద్వాలజిల్లా గద్వాల మండలంలోని దౌదార్‌పల్లి,పరుమాల సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థినిలు ఉన్నారు ?.. వారికి సరిపడా బెడ్స్ (మంచాలు), మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నాయా? లేదా ? అని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు ఫలితాలు ఎలా వస్తున్నాయి అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినిలు నిద్రించే గదుల్లోకి వెళ్ళి బెడ్స్, ఆహార పదార్థాలు,వంట గదులు, మరుగుదొడ్లు, పాఠ్య పుస్తకాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని,అట్టి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని ప్రిన్సిపాల్ కి సూచించారు.విద్యార్థులు అన్ని క్రీడల్లో పాల్గొని ప్రతిభను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.ఇందుకోసం పాఠశాలలో నాణ్యమైన క్రీడాసామగ్రి, అవసరమైన సౌకర్యాలు,అన్ని క్రీడలకు అనుకూలమైన మైదాన వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు.ప్రతి విద్యార్థి తప్పకుండా యూనిఫాం ధరించాలని తెలిపారు.అన్ని పుస్తకాలు ప్రతి విద్యార్థికి సమంగా అందేలా పంపిణీ చేయాలని సూచించారు.హాస్టల్లో డైట్ ప్లాన్ అమలును పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలన్నారు.విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో బాగా చదివి, మంచి స్థాయికి ఎదిగి,తాము చదువుకున్న పాఠశాలలు, కళాశాలలకు గౌరవం తీసుకురావడమే కాకుండా,తమ భవిష్యత్తు కోసం సహకరిస్తున్న ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అలివేలు, అనీల,పాఠశాల సిబ్బంది, విద్యార్థినిలు,తదితరులు పాల్గొన్నారు.
