మన న్యూస్, నారాయణ పేట జిల్లా : శనివారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర పశుసంవర్ధక మస్య యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందజేసే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ,వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలో ఉత్పత్తి చేయబడ్డ విత్తనాలను రైతులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. రైతులు పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. ప్రతి రైతు విత్తనాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలన్నారు. రానున్న రోజుల్లో రైతు సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ అధికారుల శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తూ వ్యవసాయంలో మార్పులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి డా.వాకిటి శ్రీహరి రైతులకు సూచించారు.ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 362కోట్ల రూపాయల రుణమాఫీ అందించినట్లు చెప్పారు.రైతుబంధు కూడా తొమ్మిది రోజుల్లో 9000కోట్ల రూపాయలు రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులంతా ఆర్థికంగా బలపడాలన్నదే రైతుబిడ్డగా తన లక్ష్యమన్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల్లో ప్రతివారం రైతులకు సలహాలు, సూచనలు చేస్తారని, కార్తుల ప్రకారంగా ఎప్పుడు విత్తనాలు కావాలో ఆ విధంగా అందించే ప్రయత్నం చేయాలని మంత్రి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నగేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి, ఏఈఓలు విజయ్, వీణ, యోగేశ్వరరెడ్డి, చందన, వైష్మవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, కావలి ఆంజనేయులు, బోయ వెంకటేష్, చెన్నయ్య గౌడ్, గోవర్ధన్, హేమ సుందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *