మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని నవ్య మాట్లాడుతూ..ఆయిల్ పామ్ సాగు రైతులకు నష్టాలు లేకుండా ఆదాయాన్ని అందించగల మగ్గమైన పంట. 1993లో రూపొందించిన ఆయిల్ పామ్ చట్టం ప్రకారం రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వివిధ సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తోంది,” అని పేర్కొన్నారు.జిల్లాకు కేటాయించిన ఆయిల్ పామ్ కంపెనీలు నర్సరీల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తాయని,అంతేకాక తగిన సాంకేతిక సలహాలు అందించి, పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేసి,ప్రతి నెలా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు గెలలను కొనుగోలు చేస్తాయని తెలిపారు.రైతుల ఖాతాల్లోకి అమ్మకానికి వచ్చిన డబ్బులు 14 రోజుల్లో జమచేయబడతాయని వివరించారు.NMEO-OP పథకం ప్రయోజనాలు:
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జాతీయ ఆయిల్ పామ్ అభివృద్ధి మిషన్ (NMEO-OP) పథకం కింద నాలుగేళ్లపాటు వివిధ రాయితీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో ఎకరానికి రూ.50,918/- వరకు ప్రోత్సాహక నిధులు అందిస్తారు. మొక్కల కొరకు రైతు ఒక్కొక్కటి ₹20 చొప్పున చెల్లించాలి.అలాగే బిందు సేద్యం పరికరాల ఏర్పాటు కోసం కూడా రైతులు కొంత వాటా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో ఉద్యాన అధికారి సుమన్,ఏఈఓ మధుసూదనరావు,ఫీల్డ్ ఆఫీసర్ హమీద్,గున్కుల్ సొసైటీ ఉపాధ్యక్షులు గొట్టం నర్సింలు,మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,హిందుస్థాన్ యూనిలీవర్ మేనేజర్ లతోపాటు గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *