మన న్యూస్, నారాయణ పేట జిల్లా :శనివారం రోజు మక్తల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి మత్తు పదార్థాలు నిల్వ ఉంచిన, అమ్మిన, అక్రమ రవాణా జరగకుండ మక్తల్ పట్టణంలో మత్తు పదార్థాలు నిర్మూలించడానికి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కిరాణా షాపులలో, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో, పన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన, సరఫరా చేసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుతది అని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పా నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పరమేశ్, కానిస్టేబుల్ నరేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *