తవణంపల్లి, జూలై 29 మన ద్యాస (నాగరాజ సరకింటి )
గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం 11 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సుదర్శన హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. హోమ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎ. రఘుపతి దంపతులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ఈ. మునిశేఖర్ హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.అదే రోజు సాయంత్రం 7 గంటలకు గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ప్రాకారోత్సవం అత్యంత భక్తి భావంతో నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాకారంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండల అధ్యక్షులు జి. వెంకటేష్ చౌదరి గారు, ఆలయ చైర్మన్ ఎ. రఘుపతి దంపతులతో కలిసి పాల్గొన్నారు. ఆలయ ఈవో ఈ. మునిశేఖర్ , పాలక మండలి సభ్యులు, అర్చకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగగా, ఆలయ ప్రాంగణం “జై శ్రీరామ్”, “జై వీరాంజనేయ స్వామి” నినాదాలతో మార్మోగింది.