మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ మాట్లాడుతూ, మొహరం పండుగ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని. ప్రజలంతా కుల మతాల కతీతంగా ప్రశాంత వాతావరణంలో పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు. పీర్ల దగ్గరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉత్సవ కమిటీ వాళ్లకు సూచించారు. పీర్ల చావడీల వద్ద, పీర్ల ఊరేగింపు సమయంలో నిర్వాహకులతో పాటు వాలంటీర్లను నియమించాలని సూచించారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ డైవర్షన్ తో పాటు, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ వారికి వ్యతిరేకంగా పోస్టులు చేయరాదని అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *