శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మట్టెద్దుల అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి,మహేష్ స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు .ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు చేయించి మొక్కలు చెల్లించుకున్నారు. అభిషేకం విశేష పూజలు అనంతరం స్వామివారికి విశేష అలంకరణ గావించారు .అలంకరణ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి మహా మంగళహారతి అనంతరం కొత్తకాపు అంబిక రాఘవేందర్ రెడ్డి దంపతులు అన్నదాన కర్తలుగా వ్యవహరించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న కృష్ణయ్య ,పోలేపల్లి అనంత కుమార్, బి. శ్రీనివాసులు,వాకిటి అంజయ్య , జానమొల్ల పాపిరెడ్డి, నవీన్ , పి .నాగరాజు, పెద్ద వెంకటయ్య,వంశీ ,రవి ,ప్రవీణ్ ,గుడిగండ్ల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం వద్ద గ్రామ దేవత శ్రీ మారెమ్మ దేవాలయం వద్ద కూడా అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్