oplus_2

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీరా పాత బ్రిడ్జి పక్కన డంపింగ్ యార్డ్ లా తలపిస్తుంది. నిజాంసాగర్ పిట్లం రహదారి పక్కన చెత్త రోడ్డుమీద పడటంతో నిత్యం దుర్వాసనను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగుతుంటాయి. ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో టాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి తడి,పొడి చెత్తను వేరు చేసి ఎరువుని తయారు చేయాలన్న ఆలోచన కూడా పోవడం గమనార్ధం.మంజీరా బ్రిడ్జి పక్కన కంపును తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

oplus_2

.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *