మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని.మాదక ద్రవ్యాలు/ మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన చట్టపరమైన నేరం. మాదక ద్రవ్యాల గురించి సమాచారం తెలిసిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని నర్వ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పబ్బతి రమేష్ గారు తెలిపారు. అనంతరం కల్వాల్ గ్రామంలో ZPHS స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్వ పోలీస్ సిబ్బంది,స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *