- నూతన చైర్మన్,కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభినందనలు..
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 28 : 38వ వార్డు వన్ టౌన్ దగ్గరలో గల శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామివారిని దర్శి తీర్థప్రసాదాలు సేకరించారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ కమిటీ చైర్మన్,సభ్యులను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాసులు మాట్లాడుతూ నిత్యం శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి,రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి కృషి చేయాలని నూతన ఆలయ చైర్మన్,కమిటీ సభ్యులకు దిశ నిర్దేశం చేశారు.నూతన కమిటీ ఆలయ అభివృద్ధికి,భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.ఆలయాల అభివృద్ధి,ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన కూటమి నాయకులు,జనసేన శ్రేణులు,ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.