ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని, మరింత విద్యారంగా సంక్షోభానికి దారితీస్తుందని వెంటనే ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని,డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నారాయణ పేట జిల్లా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర ఓ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,629 మండలాలు 1, 817 క్లస్టర్ల పరిధిలో ఉన్న 24,146 పాఠశాలలను తనిఖీ చేయడానికి పది సంవత్సరాలు అనుభవం ఉన్న సుమారు రెండువేలకుపైగా ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించి, ప్రతి సంవత్సరం, అలాగే విద్యా సంవత్సరం పొడవునా వారిని తనిఖీ బాధ్యతలలో ఉంచడంవల్ల ,వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలలలో బోధన పూర్తిగా స్తంభించిపోతుందని , దాని ఫలితంగా విద్యా ప్రమాణాలు కుంటు పడతాయనేది స్పష్టం చేశారు.ఒకవైపు ప్రభుత్వమే రాష్ట్రమంతా అన్ని పాఠశాలలో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే, ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమైన చర్యగా పేర్కొoటున్నామనీ అన్నారు.కామన్ సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి, పూర్తిస్థాయి మండల విద్యాధికారులను, ఉప విద్యాశాఖ అధికారులను, జిల్లా విద్యాశాఖాధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను వారికే ఇవ్వాలి అన్నారు.తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇప్పటికే పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ ఖాళీలు ఉండడంవల్ల బోధన స్తంభించిపోతున్నదని వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలాన్నారు.ఇప్పుడే ప్రభుత్వ ఆచరణ ,ప్రభుత్వ ప్రకటనలకు పొంతన కుదురుతుందని,లేని పక్షంలో గత ప్రభుత్వపు విధానాల్లాగే, సంక్షోభo కొనసాగుతుందన్నారు.రాస్త్రంలో విద్యారంగ పరిస్థితులపై కమిషన్ వేసి, అధ్యయనఁ చేసి, అంతే కాకుండా కొత్తగా 521 పాఠశాలలను ప్రారంభిస్తామని విద్యారంగం పట్ల ఆసక్తిని కనపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి మళ్ళీ, పర్యవేక్షణ పేరు తోటి బోధనను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడటం పాఠశాలల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, కనుక ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కోన్నారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!