విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని SI రమేష్ సూచించారు.

మన న్యూస్ నర్వ మండలం :- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా Heal your mind & plant a tree- Say no to డ్రగ్స్,అనే నినాదం తో సోమవారం, నర్వ మండలంలోని కల్వాల్ గ్రామంలో ZPHS స్కూల్లో నర్వ ఎస్సై ఆధ్వర్యంలో డ్రగ్స్,గంజాయి వంటి మత్తుపదార్థాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై గారు విద్యార్థులతో మాట్లాడుతూ..విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. మీ కాలనీ, మీ చుట్టూ ప్రక్కల ప్రాంతం లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీస్ దృష్టికి తీసుకురావాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *