కందుకూరు, మన న్యూస్ :- ప్రకాశం జిల్లా కందుకూరులో ఈ రోజు తూర్పు రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కంచర్ల రామయ్య భౌతికకాయానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్, కొమ్మరగుంట బూత్ కన్వీనర్ సువ్వాలా ముని రాజారెడ్డి, దేవరగుడిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు రాజాజీ పాల్గొని, రామయ్య సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “కంచర్ల రామయ్య గారు పత్రికా రంగంలో నిష్ఠ, నైతిక విలువలతో ముందుకు సాగారు. వారి వంటి పాత్రికేయుల ద్వారా సమాజం లో నిజం బయటపడుతుందన్నారు.”స్థానికంగా జర్నలిస్టు సంఘాలు, పలువురు ప్రజాప్రతినిధులు, విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *