

మన న్యూస్, నారాయణ పేట: తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి డా “వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా నేడు హైద్రాబాద్ ఖర్మాన్ ఘాట్ శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా ఖర్మన్ ఘాట్ ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి ఆలయ కమిటీ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా,దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తోపాటు మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, చెన్నయ్య,సాగర్,పూజా, శివ, హేమ, సుందర్, శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.