మన న్యూస్ తవణంపల్లె జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, సరకల్లు బీసీకాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. శుక్రవారం సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో భాగంగా బీసీ కాలనీకి చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి మరియు పలమనేరు శాసనసభ్యులు యన్.అమరనాథ్ రెడ్డి కి స్ధానిక నాయకులు పూలమాలు, దుశ్శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం సరకల్లు‌ బీసీ కాలనీ నుండి శ్మశానవాటిక వరకూ 13 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే మురళీమోహన్ స్ధానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి కళ్లతో చూసేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతి పల్లె బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో ప్రతి గ్రామంలో మౌళిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, ప్రజల మాటను గౌరవించే ప్రభుత్వంగా పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసీ కార్యదర్శి యువరాజు నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లి మండల టిడిపి అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎన్.పి. ధరణి నాయుడు, బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు, తవణంపల్లి క్లస్టర్ ఇంచార్జ్ సునీల్ చౌదరి, యాదమరి క్లస్టర్ ఇంచార్జ్ చిత్రానాయుడు, ఐరాల జడ్పిటిసి సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జడ్పిటిసి లతా బాబు నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ చైర్మన్ మణి నాయుడు, మాజీ పూతలపట్టు మండల అధ్యక్షులు చంద్రమౌళి, టిడిపి సీనియర్ నాయకులు రఘురాం చౌదరి, ప్రవీణ్ కుమార్ నాయుడు, తవణంపల్లి మండల మహిళా అధ్యక్షురాలు చిట్టెమ్మ, సరుకలు సర్పంచ్ కత్తి సతీష్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ‌ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *