మన న్యూస్, తిరుపతి, :
చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బుధవారం అమాస రాజశేఖర్ రెడ్డి చిత్తూరులోని ఆ బ్యాంకు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డిని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భువన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమాస రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో సహకార కేంద్ర బ్యాంకు రైతులకు వ్యవసాయ రుణాలను ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో చిత్తూరు సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలు విరివిగా అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అమాస రాజశేఖర్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని భువన్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. అమాస రాజశేఖర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ ఆనంద్ బాబు యాదవ్ కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *