

కలిగిరి, మన న్యూస్ : నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బట్టువారిపాలెంలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక కొమర రత్తయ్య (35) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం.గత రెండు నెలలుగా రత్తయ్యను వేధింపులకు గురి చేస్తున్న ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి మృతుడుకి భార్య కుమారుడు,కుమార్తె ఉన్నారు…. ప్రవేట్ బ్యాంకుల సిబ్బంది పేదలను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని గ్రామస్తులు ఆపోతున్నారు. ఇలాంటి వారిపై తగ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలియజేశారు.