గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ తెలిపారు. ఆదివారం బెజవాడ బార్ అసోసియేషన్ నందు ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగినట్లు, కాకినాడ జిల్లా, పిఠాపురం బార్ న్యాయవాది బొలిశెట్టి గౌరీ మణి ప్రెసిడెంట్ గాను, తాను జనరల్ సెక్రటరీ గాను, చోడవరం బార్ న్యాయవాది అదట్రావు వెంకట్రావు మరియు రామచంద్రపురం బార్ న్యాయవాది చిన్నం వీరెడ్డి లు వైస్ ప్రెసిడెంట్ లు గాను, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా విశాఖపట్నం బార్ న్యాయవాది చక్రవర్తి, సెక్రటరీ లుగా పార్వతీపురం బార్ సభ్యుడు కె నవీన్, సోంపేట బార్ సభ్యుడు బమ్మిడి రాజశేఖర్ లు, జాయింట్ సెక్రటరీ లుగా తుని బార్ సభ్యుడు సూర్య ప్రకాష్, వేణు గోపాల్ లులు, ట్రెజరర్ గా గొర్లె అప్పారావు, మెంబర్లు గా నందిగామ బార్ న్యాయవాది యరగొర్ల రామారావు, బెజవాడ బార్ సభ్యులు వరలక్ష్మి, ముద్దాడ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రంగారావు తెలిపారు. ఆ తరువాత జరిగిన కార్యవర్గ సమావేశం లొపూర్వపు కృష్ణ జిల్లా, ప్రస్తుతం యస్ టి ఆర్ జిల్లా ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ గా నందిగామ బార్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు ను నియమించినట్లు రంగారావు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *