మన న్యూస్,తిరుపతి, :
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తిరుపతికి చెందిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం విజయవాడలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను విజయవాడ జనసేన తూర్పు ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి లు పాల్గొని హరిప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల ఆశీస్సులతో ముందుకు వెళతానన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న హస్తకళలను ప్రోత్సహించడంతోపాటు కళాకారులను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటానన్నారు. చిన్నచిన్న హాస్పిటల్ చెక్క రాతి బొమ్మలు చేనేత కలంకారి కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మనందరిపై ఉందన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో 2008 నుంచి ప్రయాణం చేస్తున్నానని, తాను ఈ పదవికి న్యాయం చేస్తానని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *