మన న్యూస్ సాలూరు మే 31:-పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అవ్వా ,తాతలకు మంత్రి సంధ్యారాణి పింఛన్లను పంపిణీ చేశారు. శనివారం ఉదయం ఒకటి 1,4,5వ వార్డులలో ఉన్న లబ్ధిదారులకు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఆదివారం ఒకటో తారీకు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక రోజు ముందు శనివారం అవ్వా ,తాతలకు పించన్నలను అందించమని ఆదేశాలు జారీ చేయడంతో శనివారం నాడే లబ్ధిదారులకు పించన్లను పంపిణీ చేసామని అన్నారు. దివ్యాంగులకు వితంతువులకు వృద్ధుల ఇళ్ళకు ఒకరోజు ముందుగా పించన్లు అందజేసినందుకు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత వైసిపి ప్రభుత్వం వైపల్యంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పించన్నలను లభిదారులకు అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డిటివి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పప్పల మోహన్రావు, కొనిసి చిన్ని, డబ్బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *