ఇచ్చిన మాటలను నెరవేర్చని మంత్రి,మంత్రి హామీలు నీటి మూటలుగా మిగిలాయి – రేషన్ వాహనాల రద్దుపై పాచిపెంట ఎంపీపీ ప్రమీల

మన న్యూస్ పాచిపెంట, మే 31:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. ఆమె తన కార్యాలయంలో శనివారం నాడు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి రేషన్ వాహనాలు రద్దు చేయమని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. రేషన్ వాహనాలు రద్దు చేయబోమని చెప్పి జిల్లా పరిషత్లో హామీ ఇచ్చిన గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట నేడు ఏమైనట్లని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం జూన్ 12వ తేదీన జిల్లా పరిషత్ సమావేశంలో రేషన్ వాహనాలు రద్దుకు సంబంధించి రేషన్ వాహనాలు రద్దు చేస్తే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, కొన్ని గ్రామాల ప్రజలు పది నుంచి 15 కిలోమీటర్ల వెళ్లి రేషన్ తీసుకోవడం వల్ల వాహన చార్జీలు సుమారు 150 నుంచి 200 వరకు ఒక్కొక్కరికి అవుతుందని, అంతేకాకుండా ఒక్కో సమయంలో సర్వర్ పనిచేయకపోతే రోజంతా రేషన్ షాపులు వద్ద ఉండి పోయే పరిస్థితి ఉంటుందని,దీని మూలంగా గిరిజన ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారని, సభ దృష్టికి తీసుకురాగా సభలో ఉన్న మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి కలుగచేసుకుని రేషన్ వాహనాలు రద్దుకు సంబంధించి కొన్ని పేపర్లలో ప్రచురితమైనది చూసి ఎంపీపీ గా తాను మాట్లాడుతున్నానని సభలో అవహేళనగా మాట్లాడడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోని రేషన్ వాహనాలు రద్దు చేయబోమని ఆమె మాట్లాడారని అన్నారు. నాడు మాట్లాడిన మాటలు నేడు మంత్రి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఒక గిరిజన మంత్రిగా సంధ్యారాణి గిరిజన కష్టాలు తీర్చేలా ఉండాలి కానీ గిరిజన సమస్యల గురించి కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు.
అర్హులైన వారికి గత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే వారిని ఉద్యోగాలు నుంచి తొలగించడమేనా ఉద్యోగాల కల్పన అని విమర్శలు గుప్పించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు తీసేసి వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేలా కూటమి ప్రభుత్వ వ్యవహరిస్తుందన్నారు.మొదటిగా రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లు తొలగించారని, తరువాత 18 వేల మంది బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్న సేల్స్ మాన్లు ను, సూపర్వైజర్లను తొలగించారని, నేడు ఎండియూ ఆపరేటర్లు తొలగించారన్నారు. ఇదే నా కూటమి ప్రభుత్వం ఉద్యోగ కల్పన అన్నారు. గిరిజన మంత్రి అంటూ గిరిజనుల పొట్ట కొడుతున్న ఆమెకు గిరిజనులు ఉసురు తగులుతుందని ఈ దుశ్చర్యలను ప్రభుత్వం మానుకొని గతం లాగే రేషన్ వాహనాలు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీపీ కోరారు. గిరిజనులు అమాయకులు కాబట్టి ప్రభుత్వం వారిపై ఉక్కు పాదం మోపడం జరుగుతుందని అదే ప్రజా వ్యతిరేక విధానంగా మారుతుందని రానున్న కాలంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆమె ఈ సందర్బంగా హెచ్చరించారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా