

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ మిషన్ భగీరథ త్రాగునీరు సరైన పద్ధతిలో ఫిల్టర్ చేయకపోవడం, వారానికి ఒకసారి మినీ ట్యాంకులను శుభ్రం చేయకపోవడం వల్ల ఆ త్రాగునీరులో బ్యాక్టీరియా ఉండడంవల్ల కలుషితమైన నీరును ప్రజలు త్రాగడంతో ప్రతిరోజు జ్వరంతో, థైరాడ్ తో, జలుబులతో , గుండె జబ్బులతో ఇలా అనేకమైన ఆరోగ్య సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని ప్రజలు అంటున్నారు, కావున ఉన్నంత అధికారులు నాణ్యత కలిగినమిషన్ భగీరథ త్రాగునీరు ప్రజలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు, ప్రజలకు ముఖ్య సూచన నాణ్యత కలిగిన మిషన్ భగీరథ నీరు వచ్చేంతవరకు మిషన్ భగీరథ నీరును తగినంతగా వేడి చేసుకుని త్రాగలరని మనవి