మన న్యూస్ పాచిపెంట మే 8:= రైతు సాధికారిక సంస్థ ప్రకృతి సేద్య ఉద్యోగులు మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో ముందుకి సాగినప్పుడే ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా నడుస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కాబోయే చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. గురువారం నాడు పాంచాలి సర్పంచ్ యుగంధర్ తో కలిసి పిఎండిఎస్ నవధాన్య కిట్ల తయారీని పరిశీలించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు నవధాన్య కిట్ల తయారీని వివరిస్తూ వ్యవసాయ శాఖ ద్వారా మూడు రకాల 10 కిలోల విత్తనాలను ప్రకృతి సేద్య బృందం ద్వారా పదకొండు రకాల రెండు కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి ఒక ఎకరానికి 12 కిలోల నవధాన్య విత్తనాలను చల్లుకునే విధంగా రైతులకు అందించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే కిట్లలో నాలుగు కిలోల జీలుగ నాలుగు కిలోల కట్టే జనుము రెండు కిలోల పిల్లి పెసర రాయితీపై అందిస్తున్నామని ఎన్ని ఎక్కువ రకాల విత్తనాలను చల్లితే అంత ఎక్కువగా భూసారం పెరుగుతుందని భూమిలో జీవ వైవిధ్యం పెరుగుతుందని కాబట్టి రెండు కిలోల 11 రకాల విత్తనాలను కలిపి మొత్తం 14 రకాల 12 కిలోల విత్తనాలను ఒక ఎకరానికి రైతుకు అందజేయడం జరుగుతుందని తెలిపారు భూమి పైనున్న మొక్కలను పశుగ్రాసంగా వాడుకోవచ్చని వేసవిలో పశుగ్రాసం కొరత తీరుతుందని అలాగే కొన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు చల్లటం వలన ఇంటికి సరిపడా కూరగాయలు తీసుకోవచ్చని నేల లోపల ఉన్న వేరు వ్యవస్థలు వివిధ రకాల సూక్ష్మజీవులకు నిలయంగా మారి అనేక రకాల పోషకాలను మొక్కకు అందిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా పాంచాలి సర్పంచ్ యుగంధర్ మాట్లాడుతూ పిఎండిఎస్ నవధాన్యలను అన్ని గ్రామాలకు విస్తరింప చేయాలని దీని యొక్క ఉపయోగాలను తెలుసుకోవాల్సిన అవసరం రైతులకు ఎంతైనా ఉందని ప్రకృతి సేద్య విస్తరణకు మా వంతు కృషి తప్పకుండా చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య ఎం టీ యశోదమ్మ గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రకృతి సేద్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *