వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

మనన్యూస్ తవనంపల్లె మే 8:- మండలంలోని వెంగంపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు ఈరోజు రైతు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్, వ్యవసాయ విస్తరణ అధికారి లేష్మా, వెంగంపల్లె రైతు సేవ అధికారి జి దీపిక పాల్గొని రైతులకు డిజిటల్ వ్యవసాయ సాధనాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో గ్రామంలోని సుమారు 75 మంది రైతులు పాల్గొని డిజిటల్ వ్యవసాయం దాని లాభనష్టాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్మార్ట్ ఫోన్ వినియోగం, డిజిటల్ లావాదేవీలు, వ్యవసాయానికి సంబంధించిన అప్ ల ఉపయోగం వంటి అంశాలపై రైతులకు వివరించారు. రైతులు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ సమాచారం ఎలా పొందాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నారు. అంతేకాకుండా పీఎంఎఫ్బివై, పిఎంకెఎస్వై, ఆర్కెవివై, ఎమ్ఐడిహెచ్, పి ఎం ఈజిపి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అలాగే పాడి పరిశ్రమ పథకాలైన రాష్ట్రీయ గోకులం మిషన్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాల గురించి వివరించారు. పలు కేంద్ర రాష్ట్ర పథకాలు ఎలా లబ్ధి పొందాలో వాటికి కావాల్సిన అర్హతలు మరియు వాటి నియమ నిబంధనల గురించి తెలియజేశారు. అలాగే వ్యవసాయ రంగంలో పశువుల పాత్ర గురించి కూడా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్, వ్యవసాయ విస్తరణ అధికారి లేష్మ రైతు సేవా కేంద్రం వెంగంపల్లి ఇంచార్జి జి దీపిక మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related Posts

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

సింగరాయకొండ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం మన దేశం న్యూస్ సింగరాయకొండ :- దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా, ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో…

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) :కష్టకాలంలో ఉన్న నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ శంఖవరం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి నిలుస్తున్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని నెల్లిపూడి గ్రామంలోని అంబేద్కర్ కాలనీ లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

  • By JALAIAH
  • September 14, 2025
  • 2 views
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

  • By JALAIAH
  • September 14, 2025
  • 2 views
బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి