

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి అని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు గురువారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ తల సేమియా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరం లో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 5 మంది రిపోర్టర్లు రక్తదానం చేశారు అలాగే ఎస్ఆర్ పురం కార్వేటినగరం నగిరి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఎస్ఐలు కానిస్టేబుల్ హోంగార్డులు మరియు ఎన్ సీ సీ విద్యార్థులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా నగిరి డిఎస్పి మాట్లాడుతూ తలసేమియా అనేది రుగ్మత ఇది జన్యుపరమైనది ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది తెలియజేశారు అలాగే ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న రిపోర్టర్లకు ఎస్సై, పోలీసులు, హోంగార్డులు ఎన్ సీ సి విద్యార్థులకు డిఎస్పి అభినందించి రక్తదాన శిబిర సర్టిఫికెట్లను అందించారు ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం ఎస్సై సుమన్ కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల ఏబీఎన్ రిపోర్టర్ వెంకటేష్ సాక్షి రిపోర్టర్ నరేష్ సుమన్ టీవీ రిపోర్టర్ మునికృష్ణ దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.
