

ప్రభుత్వ మెడికల్ క్యాంపును సందర్శించిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్
శంఖవరం మన న్యూస్ (అపురూప్):-
అతిసార వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ అధికారి పర్వత సురేష్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో మండల కేంద్రమైన శంఖవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అతిసార వ్యాధి కలిగిన రోగులను గుర్తించి నమోదు చేసిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా కాకినాడ జిల్లా డిప్యూటీ డి ఎ హెచ్ ఓ పి . సరిత ఆదేశాల మేరకు శంఖవరం గ్రామంలో మూడు చోట్ల ప్రభుత్వ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు ఆ ప్రాంత ప్రజలు అతి సర వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే వైద్య సిబ్బందిని సంప్రదిస్తున్నారు. అతి సర వ్యాధి నియంత్రణ లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్య నిర్వహణ అధికారి పర్వత సురేష్ శంఖవరం ప్రభుత్వ వైద్యులు సత్యనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక అంబేద్కర్ నగరంలో రామాలయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా, పర్వత సురేష్ మాట్లాడుతూ, శంఖవరం గ్రామమంతా సర్వేలు నిర్వహించి డయేరియా రోగాలపై అడిగి తెలుసుకుని తీసుకోవలసిన జాగ్రత్తలు మంచి వైద్యం అందించాలని ఆయన అన్నారు. డయేరియా ప్రవళించిందని గ్రామస్తులు ఎవరో కూడా ఆందోళన పడద్దని, జాగ్రత్తలు పాటించాలని, అధికారులతో మాట్లాడి పారిశుధ్యం పై అలాగే వాటర్ ట్యాంక్ పరిశుభ్రంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రా వాసు, రౌతు శ్రీను,శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.