మన న్యూస్ ,నెల్లూరు, మే4:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే సారథ్యంలోయన్ సి సి మూడవ వార్షిక శిక్షణా శిభిరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్ అక్షర విద్యాలయ నందు గత ఏడు రోజులు నుంచి నిర్వహింపబడుతున్నది. ఈ క్యాంపులో శారీరక వ్యాయామం, యోగాసనాలు షిప్ మోడలింగ్,,ఆయుధ శిక్షణ,పర్సనాలిటీ డెవలప్ మెంట్, ఎన్ సి సి జనరల్, సోషల్ అవేర్నెస్,పేరెడ్ ట్రైనింగ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, సీమాన్ షిప్,నేవల్ ఓరియంటేషన్,సీమాఫోర్, యాంకర్ వర్క్,కమ్యూనికేషన్, తదితర విషయాలపై శిక్షణ నిచ్చారు.సోషల్ అవేర్నెస్, కమ్మ్యూనిటి డెవలప్మెంట్, జాతీయ సమైక్యత, సామాజిక అవగాహన, సామాజిక అభివృద్ధి తదితర అంశాలపై శిక్షణ నిచ్చారు. ఈ సందర్భంగా క్యాంపు కమాండెంట్ గణేష్ గొదం గవే మాట్లాడుతూ …….క్యాండిడేట్లు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి క్యాండిడేట్ దేశానికి ఉపయోగపడే విధంగా క్రమశిక్షణ, సేవా భావంతో మెలగాలని దేశ సమగ్రతకు, దేశ రక్షణకు బాల్యం నుంచే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎన్ సి సి క్యాండిడేట్లు అయినందుకు మీరు గర్వ పడాలని మీ సేవలతో దేశానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు. ప్రతి రోజు సాయంత్రం ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కేడేట్లలోని అంతర్గత శక్తులను వెలికి తీసి వారి అభిరుచులను ఆసక్తులను గుర్తించి వారిలో దాగున్నా సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్సిసి క్యాంపు అడ్జటెంట్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు,సబ్ లెఫ్ట్నెంట్ మల్లికార్జున రెడ్డి,థర్డ్ ఆఫీసర్లు మస్తానయ్య, కొండారెడ్డి,విద్యా సాగర్, అరోరా, సాయి శంకరి,దివ్య, పి ఐ స్టాఫ్ వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్, పెట్టీ ఆఫీసర్లు రంజన్, లోకేష్, లక్ష్మణ్, దీపక్,వెంకటేష్, రమణారావు, నవీన్, ఈశ్వర రావు,ఆఫీస్ సూపరింటెండెంట్ ముకుంద సాగర్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ రామన్, వివిధ కళాశాలలు, పాఠశాలల ఎన్ సి సి క్యాండిడేట్లు పాల్గొన్నారు.
