

మీర్పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమై ఉండటం, వీధిదీపాలు పనిచేయకపోవడం, చెరువులో గుర్రపుడెక్క ఉండటం వంటి సమస్యలను గుర్తించారు. చెరువు కొంత భాగం ఎండిపోయినందున పూడికతీత పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పై సమస్యలన్నింటినీ 15 రోజుల్లోపూ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్ , మరియు డి ఈ , పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.