

మన న్యూస్, నారాయణ పేట:- రబీ సీజన్లో నారాయణపేట జిల్లా లోకి పోరుగు రాష్ట్రం నుండి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ఉండేందుకు ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో ఏర్పాటుచేసిన సమీస్తాపూర్ చెక్పోస్టును ఎస్ ఐ కృష్ణంరాజు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెక్ పోస్ట్ దగ్గర విధులు నిర్వర్తించే పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి కర్ణాటక రాష్ట్రం నుండి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా చూడాలని ప్రతి వాహనానీ తనిఖీ చేస్తూ వాహనాల నెంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. వరి ధాన్యం వాహనాలు వస్తే రెవెన్యూ అధికారులకు అప్పగించాలని లేదా వాహనాలను తిప్పి పంపియాలని సూచించారు. చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండి వచ్చి పోయే వాహనాలను జాగ్రత్తగా గమనిస్తూ వాహనాలను తనిఖీ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.