మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా. భాస్కరరావు కార్యదర్శి వై.పుార్ణ చంద్రరావు గార్లు ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్ డాక్టర్ నల్లూరి. సుబ్బారావు దుస్తులను బహుకరించగా, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణ ఖర్చులను సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస రావు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మే రెండు నుంచి నాలుగు దాకా జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా మహిళా జట్టు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతయ్య గారి పాలెం గ్రామ కాపులు వి.మురళి, కె నరసింహారావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ జట్టుకు కోచ్ గా పి. హజరత్తయ్య,మేనేజర్ గా ఎ. రవి కిరణ్ వ్యవహరించనున్నారు.
జట్టు వివరాలు: 1)వి.అర్చన 2)కె.భూమిక 3)కె.సౌమ్య4) కె.సిపోరా 5) కె. త్రిగుణ (పాకల)6) ఎ.సాయిలత (చీమకుర్తి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *