అరగొండ, సెప్టెంబర్ 25 మన ద్యాస (నాగరాజ సరకింటి )
పౌర్ణమి సందర్భంగా అరగొండలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుఅర్ధగిరి దేవస్థానం చైర్మన్ ఏ. రఘుపతి, కార్యనిర్వాహనాధికారి మునిశేఖర్ తెలిపారు.పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఉదయం 11 గంటలకు సుదర్శన హోమం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు ప్రాకారోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పౌర్ణమి సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్ధగిరి దేవస్థానం చైర్మన్ ఏ. రఘుపతి కోరారు.