కలిగిరి గన్విక్ మెడికల్ షాపులో అనధికార వైద్యం..కలిగిరికి చెందిన కొండపల్లి సుమలత అనే మహిళకు ఇంజక్షన్ ఇవ్వగా వికటించి నరాలకు సంబంధించిన సమస్య తలెత్తినట్లు సమాచారం

కలిగిరి, సెప్టెంబర్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి మండల కేంద్రంలోని కొన్ని మెడికల్ షాపుల్లో అర్హతలు లేకుండా వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందుల విక్రయ కేంద్రాల్లోనే రోగులను పరీక్షించి ఇంజక్షన్లు, మందులు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో గన్విక్ మెడికల్ షాపు నిర్వాహకులు ప్రవీణ్ అనే వ్యక్తిపై అవసరమైన వైద్య అర్హతలు, అనుమతులు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.గతంలోనూ ఇలాంటి ఘటనల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం శరీరంపై పొక్కులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే మూడు రోజుల క్రితం కలిగిరికి చెందిన కొండపల్లి సుమలత అనే మహిళకు ఇంజక్షన్ ఇవ్వగా వికటించి నరాలకు సంబంధించిన సమస్య తలెత్తినట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం ఆమెను కలిగిరిలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కలిగిరిలోని మెడికల్ షాపులు, క్లినిక్‌లలో వైద్యుల అర్హతలు, అనుమతులు, మందుల విక్రయ విధానం, ప్రిస్క్రిప్షన్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వైద్య, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *