• విశ్వఖ్యాతి నగరం విశాఖ.
  • విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయం..
  • డాక్టర్ కందుల నాగరాజు..

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 18 :విభిన్న రంగాల్లోయువతరం తమ ప్రతిభను చాటిచెబుతూ విశాఖను విశ్య ఖ్యాతి నగరంగా తీర్చిదిద్దు తున్నారని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్,జనసేన పార్టీ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు.వి.జె. ఎఫ్.ప్రెస్ క్లబ్ లో జరిగిన హెచ్.ఎఫ్.సి క్లబ్ సమావేశంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో పథకాలు గెలుచుకున్న యువతను ఆయన ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కందులనాగరాజు మాట్లాడుతూ చదువు, క్రమశిక్షణ ప్రతిభకు తోడైతే సత్ఫలితాలు సాధన సులభతరం అవుతుందన్నారు.కార్యక్రమం కు అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కళాకారులు,క్రీడాకారులు, విజ్ఞాన వంతులు విశాఖకు పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్నారని తెలిపారు.ఇటువంటి వారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హెచ్ ఎఫ్ సి కోచ్,జాతీయ కిక్ బాక్సర్ పిల్లా హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల నార్త్ లఖింపూర్,అస్సాం లో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో మన విశాఖ క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్నారు.ఎస్.కె.పూజిత( బంగారు పథకం, ఆమెచూర్ టైటిల్ బెల్ట్ )నారాయణ మహిళా కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ కి ప్రవేసించారన్నారు.పి సాయినాగ్ అఖిల్ (బంగారు పథకం, అమేచూర్ టైటిల్ బెల్ట్ )అసెంట్ జూనియర్ కళాశాల లో ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ కి ప్రవేశిస్తున్నారని అన్నారు.ఎస్.కె.ఆశ్రీత్ ( వెండి) నారాయణ ఆర్ బి కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు,వి.ఎ.వి.తనీష్ (వెండి) విశాఖ వ్యాలీ స్కూల్లో 8వ తరగతి చదువుకుంటున్నాడన్నారు.వీరు పథకాలు సాధించి తెలుగువారికి గర్వ కారణంగా నిలిచారన్నారు.గత ఏడాది డిసెంబర్ లో విశాఖపట్నం కి చెందిన బి.ఇ.ఎస్. క్లబ్ నుండి బి.ఈశ్వర్ (బంగారు పతకం),( బెల్ట్ ) మొట్టమొదటిసారిగా సాదించారన్నారు.. ఈ పోటీలకు అస్సాం,ఢిల్లీ,మహారాష్ట్ర, మణిపూర్,మేఘాలయ,గోవా,త్రిపుర,అరుణాచల్ ప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలు పాల్గొన్నాయని తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను,కోచ్ పి.హేమంత్ కుమార్, క్లబ్ సారదులు వి.అశోక్,ఎస్.కె. రమేష్ లను పలువురు ప్రముఖులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్,అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్.నాగరాజ్ పట్నాయక్,హెచ్.ఎఫ్.సి. చైర్మన్, సి హెచ్ వీర్రాజు,ప్రధాన కార్యదర్శి రమేష్ కోశాధికారి అశోక్ తదితరులు పాల్గున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *