

- పివి రావు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ పండు అశోక్ కుమార్…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎస్సీలను బలి చేస్తున్నారని పివి రావు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పీవీ రావు 73వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మాలల మహారణ భేరి వర్గీకరణ వ్యతిరేకిద్దాం – రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అంటూ నినాదాలతో 12-5-2025 సాయంత్రం మూడు గంటలకు కాకినాడ పివి రావు సభ ప్రాంగణం, మెక్లారన్ హై స్కూల్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దళిత ఉద్యమ నాయకులు దళిత అధికారులు దళిత రాజకీయ నాయకులు విచ్చేయుచున్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక జై భీమ్ యూత్ సభ్యులకు మంగళవారం సాయంత్రం మాలల మహారణ బేరి బహిరంగ సభకు ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా పివి రావు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ చేయాలని పార్టీల ఉద్దేశాన్ని ముందుగానే గ్రహించి మాల మహానాడు ను స్థాపించి వర్గీకరణ పై అలుపెరగని పోరాటం చేసి సుప్రీంకోర్టులో ఐదుగురు బెంచ్ అత్యున్నత న్యాయస్థానం ద్వారా వర్గీకరణ తప్పు అని తీర్పు ఇచ్చిన స్వర్గీయ దివంగత నేత పివి రావు జయంతిని పురస్కరించుకొని మాలల మహా రణభేరి సభగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపడం జరుగుతుందని మాలలను అణగదొక్కెందుకు తప్పుడు లెక్కలతో మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ ను తెరపైకి తెచ్చి దానికి దొడ్డిదారిన ఆర్డినెన్స్ తేవాలని చేస్తున్న ప్రయత్నాలను మనము త్రిప్పి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వ కొట్రాలకు వ్యతిరేకంగా మాలలు వేలాదిగా తరలివచ్చి మాల జాతి ఉనికిని సమాజానికి చాటి చెప్పాలని చలో కాకినాడ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు, లింగం శివప్రసాద్, దళిత ప్రజాసైతన్యం వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సతీష్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా జనరల్ సెక్రెటరీ కండవల్లి లోవరాజు, శంఖవరం దళిత నాయకులు జై భీమ్ యూత్ సభ్యులు గుద్దాటి నాగేశ్వరరావు, జక్కల నాగ సత్యనారాయణ (సీనియర్ జర్నలిస్ట్), గునపర్తి అపురూప్, కె. పద్మ, బత్తిన తాతాజీ, సిహెచ్ అర్జున్ రావు, బందిలి రాంబాబు, గుడాల జాన్, జక్కల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.