

వింజమూరు మన న్యూస్ :- వింజమూరు నందలి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అందరి ఉన్నత పాఠశాల లోని విద్యార్థులు బుధవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో విజయభేర్యం మ్రోగించారు పాఠశాల విద్యార్థులు ఎం దేవి చరణ్ మరియు వి సంతోష్ 600 మార్కులకు 595 మార్కులు సాధించారు అలాగే ఎన్ సాయికిరణ్ 593 మార్కులు వివి సాత్విక్ 591 వై ప్రణవ్ 591 మార్కులను సాధించి జయభేరీ మ్రోగించారు. గత సంవత్సరంలో కూడా ఈ పాఠశాల విజయభేరిని మ్రోగించగా అదే విధంగా ప్రస్తుత సంవత్సరం కూడా తన జయభేరిని కొనసాగించారు ఈ సందర్భంగా ఆ విద్యార్థులను పాఠశాల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఈజిఎం భాగ్యలక్ష్మి ప్రిన్సిపాల్ ఏ ప్రమీల రెడ్డి డీన్ ఏ మల్లికార్జున మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు ఎంతో కష్టంతో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఉపాధ్యాయ బృంద ప్రోత్సాహంతో ఈ యొక్క విజయాన్ని సాధించగలిగారని తెలిపారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తూ పాఠశాల పేరును తమ తల్లిదండ్రులకు మంచి పేరును తెస్తారని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.