

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి 594 ల తో విజయ దుందుభి మోగించారు. మండల స్థాయిలో మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు గారు అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ సైకం శ్రీవిద్య, ఉపాధ్యాయ,ఉపాధ్యాయని లు అభినందించారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే విద్యానికేతన్ స్కూల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎంఈఓ కత్తి శ్రీనివాసరావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.