

కొండాపురం మన న్యూస్ : కొండాపురం మండలం గరిమెన పెంట పంచాయితీ పారిశుద్ధ్యం కొరకు మంజూరు చేసిన టాక్టర్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. రిబ్బన్ కటింగ్ అనంతరం టాక్టర్ నుఎమ్మెల్యే నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యం మెరుగు కొరకు చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా టాక్టర్ ను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ టాక్టర్ ను పంచాయతీ సిబ్బంది చక్కగా ఉపయోగించుకొని, తడి పొడి చెత్తను సేకరించి సంపద కేంద్రానికి తరలించి, స్వచ్ఛ గరిమె పెంట పంచాయితీ గా రూపు దిద్దాలని తెలిపారు.
అనంతరం గ్రామ సమస్యలను గ్రామ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ కమిటీని నాయకుల సమక్షంలో ఎంపిక చేశారు. మహానాడు కు ముందు కమిటీలను పూర్తి చేయాలని తెలిపారు. అందులో భాగంగానే ఈ గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాయకుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కనక ప్రతి ఒక్కరు సహకరించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొండాపురం మండలం నాయకులు మరియు గ్రామ నాయకులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.